Mohan Babu: సినిమా ఫెల్యూర్ వేరు..నటుడిగా ఫెల్యూర్ వేరు 4 d ago

తనను ఇబ్బంది పెట్టే మాటలను పట్టించుకోనన్నారు నటుడు మోహన్‌బాబు. ఆయన తనయుడు మంచు విష్ణు నటించిన కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి ఆసక్తి విషయాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా ఫెల్యూర్ వేరు..నటుడిగా ఫెల్యూర్ వేరు అని ఆయన పేర్కొన్నారు. తాను నటుడిగా ఎప్పుడూ ఓడిపోలేదని, దాదాపు 560 సినిమాలు చేసినట్లు వెల్లడించారు. గతాన్ని తవ్వుకోవడం ద్వారా ప్రయోజనం లేదన్నారు. తన ఆవేశం ఇతరులకు హానికరం కాకుండా నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.